ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. శనివారం ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. తండ్రి పట్ల తీవ్ర భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను ట్విట్టర్‌లో ఆయన పెట్టారు. ఎన్నో త్యాగాలు చేశారంటూ ఆయన భావోద్వేగం చెందారు. తన తండ్రి నుంచి జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నారా రోహిత్ ఎమోషనల్ అయ్యారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి తన తండ్రే కారణం అంటూ రాసుకొచ్చారు. ‘మీరు ఒక ఫైటర్ నాన్న. మీరు నన్ను ప్రేమించడాన్ని నేర్పించారు. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మీరే కారణం. మంచి కోసం పోరాడాలని నేర్పించారు’ అని నారా రోహిత్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ మేరకు భావోద్వేగంతో కూడిన పోస్టును ఆయన చేశారు.
మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు, జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్న అవి మా దరి చేరకుండా పెంచారని పేర్కొన్నారు. తండ్రితో జీవితాంతం మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకు ఉన్నాయంటూ రాసుకొచ్చిన నారా రోహిత్.. ఇక చివరిగా ఏం చెప్పాలో తోచడం లేదంటూ బై నాన్న అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. గడచిన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజి ఆసుపత్రిలో ఆయన పొందుతున్నారు. ఈ విధంగానే ఆరోగ్యం విషమించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, సినీనటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఆదివారం సొంత గ్రామమైన నారావారి పల్లెలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. తాజాగా నారా లోకేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కేజర్ హాట్ ఫొటోస్
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి