జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి వ్యక్తిగత జీవితంలో మరియు ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పీఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.ఇటీవల జిల్లా పోలీస్ శాఖలో జరుగుతున్న కొన్ని సంఘటనల దృష్ట్యా పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది మరియు అధికారులలో మానసికంగా దృఢంగా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పి తెలిపారు.ఈ కార్యక్రమంలో నిపుణులైన జవ్వాది వెంకటేశ్వరరావు అధికారులు మరియు సిబ్బందికి ఒత్తిడిని తగ్గించుకోవడంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది మరియు అధికారులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు.ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకునే విధంగా మార్గాలను ఎంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. విధుల నిర్వహణలో భాగంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడిని పెంచుకుని అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవద్దని తెలిపారు.పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే ఒత్తిడి పెరిగే అవకాశం ఉండదని తెలియజేసారు.శారీరకంగా కూడా దృఢంగా ఉండేటందుకు ప్రతిరోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,కొత్తగూడెం 3టౌన్ సీఐ శివ ప్రసాద్ మరియు ఇతర పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.