జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా గాంధీ నగర్ లోని ప్రతి ఇంటిని సోదా చేసి ప్రతి ఒక్కరి వివరాలను అడిగి నమోదు చేసుకోవడం జరిగింది.మొత్తం 210 ఇండ్లను సోదా చేయగా సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు,03 ఆటోలు మరియు ఒక కారును స్వాదీనం చేసుకోవడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందించి బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ వినయ్ కుమార్ బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్,కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ విజయ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది 70 మంది పాల్గొన్నారు.