Home » ఏపీ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు – Sravya News

ఏపీ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు – Sravya News

by Sravya Team
0 comment
ఏపీ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత, బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ మేరకు టిడిపి వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో తాజా ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు విజయం సాధించి అసెంబ్లీలోకి ఏడోసారి అడుగు పెట్టారు. 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి టిడిపిలోనే అయ్యన్నపాత్రుడు కొనసాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేశారు. ఇటీవల మంత్రివర్గ ఏర్పాటులో ఆయనకు బెర్తు లభించలేదు. సామాజిక సమీకరణల దృష్ట్యా అయ్యన్నకు చంద్రబాబు అవకాశం కల్పించలేకపోయారు. గడిచిన ఐదేళ్లలో అధికార వైసిపిపైనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆయనపై పలు అక్రమ కేసులను కూడా పెట్టారు. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ భూమికి ఫోర్జరీ ద్రువ పత్రాలతో ఎన్ఓసి తీసుకున్న ఆరోపణలతో సిఐడి పోలీసులు 2002 నవంబర్ 2002 అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి గోడలు దూకు మరి ఆయన్ని, ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. అయినా అయ్యన్నపాత్రుడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీనియర్‌టీకి గౌరవాన్ని ఇచ్చి స్పీకర్ పదవిని ఎంపిక చేశారు. స్పీకర్ పదవిని కోరుతూ ఒకరిద్దరూ సీనియర్లు ముఖ్యమంత్రిని కలిసినా.. అయ్యన్నను ఎంపిక చేసినట్లు ఆయన వారికి తెలియజేశారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఉత్తరాంధ్రకే చెందిన ప్రతిభా భారతకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇప్పుడు మరోసారి ఇదే చేరిన అయ్యన్నపాత్రుడు కి ఆ అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే ఆలోచన డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇచ్చేలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. చీఫ్ విప్ గా నరేంద్రను నియమించారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in