100
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తులకు, ఇతర అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు
గౌ ” కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని
వారి ఛాంబర్ లో గౌరవ ఎమ్మెల్యే
డాక్టర్ తెల్లం వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిసారు.
60 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అందజేత
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితిని నెలకొన్న సమస్యలను పూర్తిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి వివరించి అభివృద్ధికోసం నిధులు కేటాయించవలసిందిగా వినతి పత్రంతో పాటుగా 60 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అందించారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషిచేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారంతో నిధులు కేటాయిస్తామని తెలిపారు.