తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. లడ్డు వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పలు పార్టీలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులతోపాటు సినీ ప్రముఖులు కూడా లడ్డు వివాదంపై ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళ్లి పూజలు నిర్వహించారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతికి వెళ్లి ప్రమాణం చేశారు. తమ హయాంలో కల్తీ జరిగితే తమ కుటుంబం రక్తం కప్పుకుని చచ్చిపోవాలంటూ ఆయన దీపం ఆర్పిపై ప్రమాణం చేశారు. ఈ ఇంకా రాజుకుంటున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి స్వామి వారిని దర్శించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అడ్డుకుంటామని కూటమి నాయకులు, కార్యకర్తలు చెబుతుండగా, తిరుపతిలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుపతి పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అక్టోబర్ 24 వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయవలసి ఉంది. పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక.
సాయంత్రం ఏడు గంటలకు తిరుపతికి వెళ్ళనున్న జగన్
లడ్డు వివాదం నేపథ్యంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు తిరుపతి చేరుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకొని అక్కడ బస చేస్తారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు అనంతరం తిరుమల నుంచి తిరిగి ప్రయాణం అవుతారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆయన డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేలా ఒత్తిడి బిజెపి నేతలు చూస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత అనుచరులతో కలిసి స్వామివారి భజన చేసుకుంటూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో తిరుపతికి వెళ్లారు. జగన్ చేసిన పాపానికి అందరూ స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆమె జగన్ తిరుమలకు రావాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. డిక్లరేషన్ లేకుండా వస్తే స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు జగన్ ను అడ్డుకుంటారని చెప్పారు. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు జగన్ కుట్ర ఆయన అనుకూలంగా ఉంది. జగన్ కు వస్తే తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పోలీసులు చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్.. ఓల్డ్‌సిటీలో కూల్చివేతలు షురూ
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..