ఏపీలో తిరుపతి కేంద్రంగా వివాదం కొనసాగుతోంది. తిరుపతిలో భక్తులు అందించే లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిసినంటూ కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. గత వైసిపి నిర్లక్ష్యం వల్లే తిరుమలలో స్వామివారికి అపచారం జరిగిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కూటమి నేతలు, అటు వైసిపి నేతల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు వెళుతున్నారు. శనివారం ఉదయం ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తిరుపతి లడ్డు నేపథ్యంలో ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళుతున్నారంటూ కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి వెళితే తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం చేయాలంటూ కూటమి నేతలు చేస్తున్నారు. డిక్లరేషన్ పై సంతకం చేయకుండా స్వామివారిని దర్శించుకుంటే ఊరుకునేది లేదంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రావద్దు అంటూ బిజెపి నేత మాధవి లత పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి ముఖ్యనేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై ఎందుకు సంతకం చేశారు. జగన్ ఆ పని చేయరని, సంతకం చేయకుండానే తిరుమలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకుంటామని తమను ఎవరు అడ్డుకోలేరు భూమన ఏదైనా. హోమన కరుణాకర్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. తిరుమలతో జగన్మోహన్ రెడ్డి వెళ్లడం పట్ల తమకు అభ్యంతరం లేదని అయితే తప్పనిసరిగా ఆయన డిక్లరేషన్ అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ సాంప్రదాయాన్ని పాటించాలని సూచించారు. డిక్లరేషన్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు ఏమిటి డిక్లరేషన్..?
తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 1810వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం విస్తరిస్తున్న పరిస్థితుల్లో తిరుమల ఆలయాన్ని నవాబులు పరిపాలించేవారు. ఆనాటి బ్రిటీష్ పాలకులు డిక్లరేషన్ అనే నిబంధన తీసుకోవచ్చని చెబుతారు. దేవాదాయ చట్టం 30/1987 అనుసరించి 1990లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ది టీటీడీ నిబంధనలో 136గా దీనిని చేర్చారు. ఈ రూల్ ప్రకారం తాను అన్య మతస్థుడిని కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం, భక్తి ఉందని, స్వామి దర్శనానికి అనుమతించాలని కోరతారు. ఆలయ నిబంధనలు ఏవి అతిక్రమించబోనని, పూర్తి వివరాలతో అఫిడవిట్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఇది స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సమర్పించాల్సి ఉంటుంది. తిరుమలేశుడు దర్శనానికి వచ్చిన అన్య మతస్తులు 17వ కన్పార్ట్‌మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేసి ఇస్తారు. అధికారులే వీఐపీల వసతిగృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడు జగన్ వద్ద అధికారులు కూడా గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి సంతకాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు ఈ విధంగా డిక్లరేషన్ ను ఇచ్చారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు. గతంలో ప్రతిపక్ష హోదాలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు గానీ, ముఖ్యమంత్రి హోదాలో స్వామిని దర్శించుకున్న సమయంలో గానీ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించలేదు. కానీ తాజా పర్యటన నేపథ్యంలో ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలన్న డిమాండ్ కూటమి నాయకుల నుంచి వినిపిస్తోంది. మరి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామి వారిని దర్శించుకుంటారా లేదా ? అన్నది చూడాల్సి ఉంది.
గర్భం దాల్చారా.. అయితే ఈ దుస్తులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..