23
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడకు చెందిన పంచమి నర్సమ్మ కుమారులు చంద్రం, అర్జున్ చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఈనెల 3న గ్రామంలో ఓ వ్యక్తి చనిపోగా నర్సమ్మను వాళ్ల కొడుకుతో శవ యాత్రకు డప్పు కొట్టించమని అడిగారు. తన కొడుకులు ఉద్యోగం వదులుకొని రాలేరని ఆమె తెలిపింది. దీంతో ఊరి పెద్దలు వారి కుటుంబాన్ని బహిష్కరిస్తూ ఎవరూ మాట్లాడకూడదని, ఎవరైనా మాట్లాడితే వారికి రూ.5 వేలు జరిమానా వెస్తామని తీర్మానం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్లడంతో పోలీసులు చర్యలు తీసుకొని గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.