భద్రాచలం కేంద్రంగా అనేక డివిజన్లో నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న 100 పడకల ప్రభుత్వం వైద్యశాలకు రోగులు వైద్యం నిమిత్తం వస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందని పెద్ద ఆసుపత్రి అవటం వలన సదుపాయాలు ఉంటాయని ప్రజలు నమ్మి ఈ ఆసుపత్రికి భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఈమధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో భద్రాచలానికి చెందిన ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు కూడా బదిలీ నిమిత్తం వెళ్లిపోవడం వలన ఇక్కడ ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఎన్ని ప్రైవేట్ వైద్యశాలలో వెలిసిన దానికి దీటుగా ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల అన్ని సదుపాయాలు కల్పిస్తూ సూ పర్పెండెంట్ డాక్టర్. ముదిగొండ రామకృష్ణ పర్యవేక్షణలో ఎంత పెద్ద సమస్య అయినా పరిశీలించి పరిశోధించి ఆ జబ్బుకి వైద్యం చేసే దాంట్లో మంచి అవగాహన , అనుభవం కలిగి ఉన్నటువంటి డాక్టర్ రామకృష్ణ అని చెప్పాలి. ఈ ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుల కొరత ఉన్నప్పటికీ ఉన్న వైద్యులతో తనదైన శైలిలో వైద్యం చేయించడం ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం బదిలీల నేపథ్యంలో వైద్యులు మొత్తం కూడా ప్రభుత్వ వైద్యశాలను వదిలి వెళ్లిపోవడం వలన వైద్యం కొరత ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా ప్రతి చోట నీటి నిలవలు ఉండటం ప్రమాదకర జ్వరాలు వస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు సోకే తరుణంలో వైద్యులు లేకపోవడం ప్రజలకు ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది వర్షాకాలం వరదలు ముంచెత్తుతున్న ఈ పరిస్థితుల్లో వైద్యులను బదిలీ చేయడం సరైన విధానం కాదని అనేకమంది మేధావులు ప్రజలు బదిలీలను నిలిపివేయాలని ఎంత మొరపెట్టుకున్నా బదిలీలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి వైద్యులను సంపూర్ణంగా నింపాలని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి గైనకాలజిస్టులను ఇద్దరిని ఏర్పాటు చేయాలని స్కానింగ్ సెంటర్లను రెండు ఏర్పాటు చేయాలని అలాగే పంటి వైద్యులను పన్నులకు సంబంధించిన అన్ని సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలలోనే కల్పించాలని గుండె కు సంబంధించిన వైద్యులు ,పరికరాలు ఆపరేషన్ కూడా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోనే జరగాలని ఆ దిశగా నిపుణులను ఏర్పాటు చేయాలని అదే క్రమంలో ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నందున సర్జరీ తో పాటు స్టీల్ రాట్లను కూడా ప్రభుత్వ వైద్యశాలలోనే అందుబాటులోకి తేవాలని ఎమర్జెన్సీ కి సంబంధించిన ప్రతి మెటీరియల్ ఆసుపత్రిలోనే ఉండే విధంగా చర్యలు చేపట్టాలని జనరల్ చెకప్ తో పాటు అత్యవసర విభాగం కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం మెండుగా ఉండటం వలన వైద్యులను తక్షణమే నియమించాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు.
వైద్యులు లేక వెలవెల పోతున్న పెద్ద ఆసుపత్రి.
27