27
తొండూరు మండలంలోని మల్లేల, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు. అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన అన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ ప్రమాదాలను నివారించాలని సూచించారు. లూజ, తక్కువ ఎత్తులో ఉన్న తీగలను గుర్తించి సరి చేయాలని తెలిపారు.