49
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నారు. ఎన్నికల ముందు ఎలాగైతే నేతలు వరుస పెట్టి రాజీనామా చేసారో..ఇప్పుడు కూడా వరుసపెట్టి జగన్ కు షాక్ ఇస్తూ టిడిపి లో చేరుతున్నారు. తాజాగా MLC పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా..ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేసారు. కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ లు తమ రాజీనామాను మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుకు అందజేయబోతున్నారు. గురువారం ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ చేయగా.. ఆ వెనువెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వైదొలుగుతుండగా ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.