53
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 36 ఏళ్ల గాబ్రియెల్ విండీస్ తరఫున 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 202 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచ్ గతేడాది జులైలో భారత్‌పైనే ఆడారు. 2012లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.