9
సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ‘హైడ్రా’ అధికారులు నోటీసులు అంటించారు. HYDలోని మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.