51
కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా? ఏం జరుగుతుందో మీకైనా తెలుసా CS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి? ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒక వేళ ఆమోదించకపోతే దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని Xలో డిమాండ్ చేశారు.