తెలంగాణలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ, ఈడి తో విచారణ జరిపించాలని పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని శాంతియుతంగా ధర్నా చేస్తున్న పి డి ఎస్ యు నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని త్రీవంగా ఖండిస్తున్నమని మస్తాన్ తెలిపారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, పేద మధ్య తరగతి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే రద్దు చేయాలని, 2025- 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని కొరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ముందు ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. దీనిని జయప్రదం చేయాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఈ జిల్లా కమిటీ సభ్యులు సాగర్, రామకృష్ణ, గోపి, అజయ్ పాల్గొన్నారు.
తెలంగాణలో శ్రీ చైతన్య విద్యాసంస్థల అవినీతిపై సీబీఐ, ఈడి తో విచారణ జరిపించండి: పిడిఎస్ యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ డిమాండ్
6