55
డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటివరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి KTR మండిపడ్డారు. ‘నిన్న ఐదుగురు, ఇవాళ ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు. ఒక్క బెడ్‌ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చింది’ అని డిమాండ్ చేశారు.