Home » ఈఎంఐ కట్టలేదని కోడిని ఎత్తుకెళ్లిన రికవరీ ఏజెంట్

ఈఎంఐ కట్టలేదని కోడిని ఎత్తుకెళ్లిన రికవరీ ఏజెంట్

by v1meida1972@gmail.com
0 comment

బజాజ్ ఫైనాన్స్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ లోన్, లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారా ? జాగ్రత్త ఈఎంఐ కట్టడం అసలు మిస్ చేసుకోకండి. ఖర్మ కాలి ఈఎంఐ బౌన్స్ అయితే బ్యాంక్ లో చెక్ బౌన్స్ ఛార్జ్, బజాజ్ లో లేట్ పేమెంట్ ఛార్జ్ మాత్రమే కాకుండా రికవరీ ఏజెంట్ లకు కూడ ఏదో ఒక విధంగా ఛార్జ్ కట్టాల్సిందే. చెక్ బౌన్స్, లేట్ పేమెంట్ ఓకే రికవరీ ఏజెంట్ ఛార్జ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదువుతున్నది అక్షరాల నిజం. కొత్తగూడెంలో బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. సమయానికి ఈఎంఐ కట్టకపోతే వాళ్ళలో కొందరు రకరకాల రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారు.. ఇప్పటికే లోన్‌ యాప్‌ల వేధింపులు, ఫైనాన్స్‌ సంస్థల టార్చర్‌తో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా, ఈఎంఐ కట్టలేదని కస్టమర్ దగ్గర ఉన్న పందెం కోడిని బజాజ్ ఫైనాన్స్ సంస్థ రికవరీ ఏజెంట్ తీసుకెళ్లిన ఘటన భద్రాద్రి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని ఓ గ్రామంలోని ఈ ఘటన జరిగింది. ఆర్థిక పరిస్థితి కలిసి రాకపోవడంతో ఓ వ్యక్తి ఈఎంఐ సరైన టైంకి చెల్లించలేకపోయాడు.. అయితే, ఈఎంఐ కోసం అతని ఇంటికెళ్లిన బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ ఇప్పటికే నువ్వు ఈఎంఐ కట్టాల్సిన గడువు 20 దాటిపోయింది. ఇప్పటికిప్పుడు ఈఎంఐ కట్టాల్సిందే అంటూ నానా హంగామా చేసాడు. కొంత సమయం ఇస్తే కడతా అన్న బాధితుడి మాట వినకుండా కట్టాల్సిన ఈఎంఐ గురించి పెద్ద గొడవే చేశాడు. ఇదే క్రమంలో సదరు రికవరీ ఏజెంట్ కన్ను బాధితుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పందెం కోడి మీద పడింది. మనసులో ఎం అలోచించాడో ఏమో కానీ ఎంచక్కా ఆ పందెం కోడిని తీసుకోని వెళ్ళిపోయాడు. కోడిని అమ్మేసి ఈఎంఐ కట్టాలనుకున్నాడా ? ఈఎంఐ చెల్లించేందుకు గడువు ఇచ్చినందుకు తాను కోడిని పట్టుకెళ్లాడా అన్నది అర్ధం కానీ ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వివరాలు తెలుసుకునేందుకు బజాజ్ ఫైనాన్స్ బాధ్యులను సంప్రదించగా అలాంటిదేమి లేదన్న సమాధానం వచ్చింది. కానీ విషయం విలేకరుల వరకు వెళ్ళిందన్న సమాచారం అందుకున్న ఫైనాన్స్ రికవరీ టీం లీడర్, మేనేజర్ సదరు ఏజెంట్ ను తీవ్రంగా మందలించి ఆ కోడిని బాధితుడికి అప్పగించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in