అపరిష్కృతంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు హాస్పిటల్ కి వస్తే హాస్పిటల్ లో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి సిపిఎం టౌన్ కమిటీ సర్వే నిర్వహించిందని ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. హాస్పిటల్ కి వచ్చిన రోగులు ముఖ్యంగా డ్రైనేజీ లీక్ అవడం వలన డ్రైనేజీ ద్వారా వచ్చే దుర్గంధం తోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఈ ఎమర్జెన్సీ వార్డులో కనీసం వెంటిలేటర్లు పనిచేయడం లేదని మానిటర్లు పనిచేయడం లేదని డెంగ్యూ వ్యాధి నివారణకు అవసరమైన ప్లేట్లెట్ మిషన్ కూడా సక్రమంగా లేదని దీనివలన మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. డాక్టర్ పోస్టులు, నర్సింగ్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రోజుకి ఐదు మంది రోగులు వస్తున్న హాస్పిటల్ లో కేవలం మూడు స్ట్రేచర్లు మాత్రమే ఉన్నాయన్నారు. జిల్లా కేంద్ర హాస్పిటల్ పరిస్థితులే ఈ రకంగా ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలంటే మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మెరుగైన వైద్య సౌకర్యం అందించాలంటే ప్రభుత్వ హాస్పటల్ అభివృద్ధి చేయాలని హాస్పిటల్ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పటల్ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, టౌన్ కమిటీ సభ్యులు వీరన్న, లక్ష్మి, రమేష్, నాయకులు బుర్ర వీరభద్రం, ప్రమోద్, రామ్ చరణ్, నాగ దుర్గ, కోటమ్మ, రుహీన తదితరులు పాల్గొన్నారు.
అపరిష్కృతంగా ఉన్న హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని హాస్పిటల్ ఎదుట సిపిఎం ధర్నా
5