69
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే పిల్లల పట్ల వికృత చేష్టలకు పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలోని సింగరేణి స్కూల్ లో వెలుగులోకి వచ్చింది. తాజాగా శుక్రవారం పిల్లలు స్కూలుకు వెళ్లమంటూ స్కూల్లో తమను టీచర్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి ఇబ్బంది పెడుతున్నాడంటూ తల్లిదండ్రులకు తెలిపారు. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై ఆగ్రహించిన పిల్లల తల్లిదండ్రును పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. బాధిత విద్యార్థినుల తల్లితండ్రుల కథనం మేరకు వేణు అనే ఉపాధ్యాయుడు స్కూలుకు వచ్చే చిన్నారులను శారీరకంగా హింసిస్తున్నాడని పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు టీచర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.