52
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. తేజ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాతో తేజ సూపర్ హిట్ అందుకున్నారు.