13
అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ ప్రమాదం మర్చిపోకముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.