ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ సీఎం గా బుధువారం బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న బాబు..రాత్రి అక్కడే బస చేసి.. ఉదయం 09 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
ఇక దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తమది దేశ చరిత్రలోనే చరిత్రాత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ కోరికనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు చెప్పారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో అవసరం కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు.
ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి నష్టం లేదని.. దానిని గాడిలో పెట్టి.. పేదరికం రాష్ట్రంలో ఏపీని మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే నేటి నుంచే ప్రజా పాలన మొదలైందని.. తిరుపతి నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని అన్నారు. ఇందులో భాగంగా తిరుపతి కొండను పూర్తిగా ప్రక్షాళన చేశారు.. తిరుమలలో ఓ నమో వేంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించారు సీఎం.