Home » సీఎం చంద్రబాబు తిరుపతిలో ఉండగానే టీటీడీ నిర్ణయం.. ఆ విధానం రద్దు – Sravya News

సీఎం చంద్రబాబు తిరుపతిలో ఉండగానే టీటీడీ నిర్ణయం.. ఆ విధానం రద్దు – Sravya News

by Sravya News
0 comment
సీఎం చంద్రబాబు తిరుపతిలో ఉండగానే టీటీడీ నిర్ణయం.. ఆ విధానం రద్దు


తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. టిటిడి లడ్డు కల్తీ వ్యవహారానికి కారణంగా రివర్స్ టెండరింగ్ తాజాగా టీటీడీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో ఆదేశాలు జారీ చేశారు. గతంలో వైయస్సార్ పార్టీ ఆబ్కారీని ప్రభుత్వం అనేక శాఖలో టెండరింగ్ అమలు చేసింది. అందులో భాగంగానే టీటీడీలో కూడా రివర్స్ టెండరింగ్ అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం నెయ్యి సరఫరా చేసే సంస్థను కూడా మార్చింది. తక్కువ రేటుకు ఇచ్చిన మరో డైరీకి ఈ బాధ్యతలను అప్పగించింది గత వైసిపి ప్రభుత్వం. రివర్స్ టెండరింగ్ వల్లే సదరు నెయ్యి సరఫరా చేసే సంస్థ కల్తీకి జరిగినట్లు కూటమి నాయకులు విమర్శలను గుప్పించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నెయ్యి కల్తీ వ్యవహారాన్ని కొద్దిరోజుల కిందటే బయటపెట్టింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ స్పష్టం చేసింది.

ఆధారాలు లేకుండా కల్తీట్లు ఎలా మాట్లాడుతారు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో టీటీడీ రివర్స్ టెండరింగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలోనే ఉన్నారు. ఆయన తిరుపతిలో ఉండగానే టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమలలోని పాంచ జనయం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని ఆధునిక వంటశాలను ఆయన కారణంగా. ఈశాల వంటకాన్ని సుమారు రూ.13.45 కోట్ల వ్యయంతో 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు మరియు పాలు మొదలైన వాటిని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆహార తయారీ కోసం ఆవిరి ఆధారిత వంట, ఎల్పీజీ ద్వారా నడిచే ప్రదేశాలు, ఎగ్జాస్ట్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వంటశాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అనంతరం పరిశీలించారు.

18 ఏళ్లు నిండిన యువతులకు సువర్ణ అవకాశం.. ఉచితంగానే శిక్షణ
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in