ఖమ్మం జిల్లా పరిషత్ సెంటర్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి పాత ధర్నా చౌక్ వరకు కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్య నారి శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. సంఘటన జరిగి ఎన్ని రోజులైనా కూడా నిందితులని నిర్ధారించడం గాని, సరైన సమాచారాన్ని అందించడంలో వ్యవస్థాగత లోపాలను ఖండిస్తూ ఇటువంటి అత్యాచారాల్ని ముందు ముందు జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను అర్ధిస్తూ ఆక్రోశంతో మహిళా అధ్యాపకులు నినదించారు. ఈ కార్యక్రమంలో విద్యా నారీ శక్తి కన్వీనర్లు నీరజ, ప్రమీల, నవీన, జ్యోతి, విజయలక్ష్మి, లలిత, అనిత, సరళ, లావణ్య, శ్వేతా, మానస, రాజ్యలక్ష్మి, సుమమాలిని, ఖమ్మం జిల్లా సెక్రెటరీ వేలాద్రి, ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు సతీష్ , ప్రిన్సిపల్ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోల్కత్తా వైద్య విద్యార్థి హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంటర్ విద్య నారి శక్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
21