ముద్ర,తెలంగాణ:-నేడు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.. అలాగే ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ శుభకాంక్షలు తెలిపారు.
“రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు… ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు… శ్రీ భట్టి విక్రమార్క గారికి… హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు…
ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు…
శ్రీ భట్టి విక్రమార్క గారికి…
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని అందించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/pCyLTOij3Y
– రేవంత్ రెడ్డి (@revanth_anumula) జూన్ 15, 2024
ఈ సందర్బంగా ప్రజా భవన్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రజా భవన్ లోని పోచమ్మ తల్లి దేవాలయం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి వి ను యాదగిరిగుట్ట వేద పండితులు, హైదరాబాదులోని ప్రముఖ దేవాలయాల ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.