టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా తనవంతు సాయం ను అందించేందుకు ముందు ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య ఏదో విధంగా పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచి మనసును చాటుకున్నారు. కామెడీ విలన్ గా అందరికీ సుపరిచితుడు అయిన ఫిష్ వెంకట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లో ఫిష్ వెంకట్ తన దయనీయ పరిస్థితిని తెలియజేశాడు. ఆ సమయంలోనే పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఆయనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకట్ గురించి ఎంక్వౌరీ చేశారట. వెంటనే అపోలో ఆసుపత్రి లో తన తరపున ఫిష్ వెంకట్ కి ఉచిత చికిత్స అందించాలని సూచించాడట. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స ప్రారంభం అయింది. అంతే కాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించి గొప్పతనం చాటుకున్న మెగాస్టార్ ఇప్పుడు చిన్న నటుడు, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ కి తనవంతు సహాయంను చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు, వందల కోట్ల పారితోషికం తీసుకునే వారు, ఫిష్ వెంకట్ తో కలిసి నటించిన వారు ఉన్నారు. కానీ ఆయనకు సహాయం చేసేందుకు చిరంజీవి తప్ప ఎవరూ ముందుకు రాకపోవడం దారుణం.
ఫిష్ వెంకట్‌కి మెగా సాయం.. మరోసారి మంచి మనసు చాటుకున్న చిరు
54