ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కెమెరామెన్ వడ్లూరి నరేష్‌కు మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం రూ. 1.76 లక్షలు కొత్త జయపాల్ రెడ్డి, ఒక లక్షకేంద్ర మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్‌ను ఆదుకున్నారు.
దుబాయ్ నుండి కొత్త జైపాల్ రెడ్డి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపన్న హస్తం అందించారు మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి. ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సింహ తెలిపి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు.
ఈ నెల 1వ తేదీన విధులు ముగించుకుని కరీంనగర్ నుండి బైక్‌పై ఇంటికి వెళ్తున్నందున తీగలగుట్టపల్లి వద్ద కెమెరామెన్ నరేశ్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు. చికిత్స నిమిత్తం రెనె ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న మైత్రి యాజమాన్యం ఆసుపత్రిలో నరేశ్‌ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది. తామున్నామని భరోసా కల్పించింది. నిరుపేద కుటుంబం ఆసుపత్రిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది నరేశ్ కుటుంబం. మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తానున్నానని ముందుకొచ్చారు. ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు సిద్దపడ్డారు. రెనె మొత్తం ఆసుపత్రిలో నరేశ్ చికిత్సకు నాలుగు లక్షల రూపాయల బిల్లు అయింది. మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు రూ. 20 వేలు, టీఎన్‌జీవో నేతలు రూ. 10 వేలు, మరియు కెమెరామెన్లు, ఫొటో గ్రాఫర్లు రూ. 25 వేలు జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు. శనివారం నరేశ్ డిశ్యార్జ్ అవుతున్న సందర్భంలో మిగిలిన రూ. లక్షా 76 వేల 932 ఉండగా మైత్రి గ్రూప్ ఛైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి చెల్లించారు.