అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ మట్టి రవాణాను తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, అక్రమ మట్టి తోలకాలను అరికట్టాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి తోలకాలను అరికట్టాలని కోరుతూ ఆధార్ పార్టీ, ఆదివాసి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు మట్టి దందా చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. మట్టి తోలకాలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తు లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఓ నాయకుని అండ చూసుకొని ఇలా మట్టి తీసుకు పోతున్నారని, తక్షణమే అక్రమ రవాణాను నిలిపేయాలని కోరారు. అనంతరం ఈ అక్రమ మట్టి తోలకలను నిలిపివేయాలని కోరుతూ తహసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి తోలకాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు అప్పటికే ఆగకపోతే తమ పార్టీ, ఆదివాసి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తంబల రవికుమార్, నాగేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మట్టి రవాణాను తక్షణమే ఆరికట్టాలి:
57