Home » గ్రామాలలో వ్యాపిస్తున్న విష జ్వరాలను అరికట్టాలి: పివైఎల్, పిఓడబ్ల్యు డిమాండ్

గ్రామాలలో వ్యాపిస్తున్న విష జ్వరాలను అరికట్టాలి: పివైఎల్, పిఓడబ్ల్యు డిమాండ్

by v1meida1972@gmail.com
0 comment

ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పివైఎల్, పిఓడబ్ల్యు పాల్వంచ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పి వై ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కోర్సా రామకృష్ణ, పిఓడబ్ల్యు పాల్వంచ డివిజన్ నాయకురాలు వగ్గేలా పద్మ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అరికట్టాలని ప్రతి ఏటా వర్షాకాలంలో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు అవస్థలు పడుతున్న గాని అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్న గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా లేనందున వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు పరికరాలు మందులు సరిపడా అందుబాటులో లేకపోవడం, వలన వైద్య సిబ్బంది కూడా జనాలకు తగ్గట్టుగా లేకపోవడం, ప్రజలు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారని, అదే అదునుగా భావించిన ప్రైవేటు వైద్యులు వ్యాధికి సంబంధం లేని పరీక్షలు చేసి మందులు రాయించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వారానికి ఒకసారి వైద్య క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వ వైద్యశాలలో సరిపడినన్ని వైద్య పరీక్ష పరికరాలు, మందులు, వైద్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి, సరిపడ వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాలలో దోమలు నివారణ మరియు వీధులన్నిటినీ శుభ్రపరచాలని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామాలలో రోగులకు వైద్యం అందించాలన్నారు. అలాగే వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పాల్వంచ మండల కార్యదర్శి నీలం భాస్కర్,పి వై ఎల్ పి ఓ డబ్లు మండల నాయకులు తాటి నాగరాజు,రాయబారపు కరుణ,జి వెంకటేశ్వర్లు,కే వెంకట మహాలక్ష్మి,స్వప్న మరియు గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in