29
ఫోన్ పే/గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించినట్లు TGSPDCL, APCPDCL వెల్లడించాయి. ప్రస్తుతం ఫోన్ పేతో పాటు విద్యుత్ సంస్థల యాప్‌లు, వెబ్‌సైట్లలో బిల్లులు చెల్లించవచ్చని తెలిపాయి. మరో 4, 5 రోజుల్లో గూగుల్ పే ద్వారా కూడా స్వీకరిస్తామని పేర్కొన్నాయి. రెండు నెలల క్రితం ఫోన్ పే వంటి డిజిటల్ యాప్స్ నుంచి చెల్లింపులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. RBI మార్గదర్శకాల ప్రకారం.. గత నెలలో యూపీఐ తరహా డిజిటల్ పేమెంట్లను నిలిపివేసి, తమ అప్లికేషన్, వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేయాలని డిస్కంలు కోరాయి. అయితే ఎక్కువమంది ఆ పేమెంట్ విధానంతో గందరగోళానికి గురికావడంతో క్రమంగా బిల్లు చెల్లింపులు తగ్గిపోయాయి.