గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. తాజాగా ఆయన గన్నవరం వస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరానికి దగ్గరలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆయన కార్లలో ఆయన ప్రయాణిస్తూ గన్నవరం చేరుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఆయన్ను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీయే దాడికి ప్రోత్సహించినట్లుగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు.. వంశీని ఏ1గా చేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అరెస్ట్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు రోజు వల్లభనేని వంశీ ఇంటిపై దాడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. వందలాది మంది ఆయన ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ తరువాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్‌లో కొందరు కొనసాగుతున్నారని, అమెరికాలో వెళ్లిపోయారంటూ ప్రచారం. కాగా, రెండు నెలలు తరువాత గన్నవరం వస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వంశీ అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించడం లేదు. సంబంధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీని వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు లాయర్లు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లాయర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి.
మరో పతకంపై గురిపెట్టిన మనుభాకర్.. నేడు ఫైనల్ మ్యాచ్
ఒలింపిక్స్ బ్రాంజ్ బ్యూటీ.. ఎవరీ మను భాకర్