73
YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లబ్ధిదారుల కోసం గత వైసీపీ ప్రభుత్వం 8,468 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2,489 ఇళ్లు అనర్హులకు కేటాయించినట్లు తాజాగా గుర్తించారు. జగనన్న లేఅవుట్లలో విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ శివ శంకర్ విచారణ జరపగా.. 2,489 మంది అనర్హులు ఉన్నట్లు తేల్చారు.