Home » ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే సరికొత్త స్లోగన్‌ అందుకున్న జగన్‌.. అదేమంటే..! – Sravya News

ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే సరికొత్త స్లోగన్‌ అందుకున్న జగన్‌.. అదేమంటే..! – Sravya News

by Sravya News
0 comment
ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టే సరికొత్త స్లోగన్‌ అందుకున్న జగన్‌.. అదేమంటే..!


రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. రాజకీయంగా యాక్టివ్ కావడానికి చాలా సమయం తీసుకున్నారని అంతా భావించారు. 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కోలుకునే అవకాశం లేదని, వారంతా బయటకు రావడానికి చాలా సమయమే పడుతుందని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జగన్మోహన్‌రెడ్డి నెల రోజులు కాకుండానే ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టేశారు. ఫలితాలు విడుదలైన వారం రోజుల్లోనే పులివెందుకు వెళ్లిన జగన్.. అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ తరువాత వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యకు గురి కావడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వినుకొండతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు,మారణకాండను నిరసిస్తూ ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారు.

ఈ నేపథ్యంలో మరింత రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు వైసీపీ అధినేత జగన్. గత ప్రభుత్వం తప్పులు చేసిందంటూ కొద్దిరోజులు నుంచి సీఎం చంద్రాబునాయుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. వైసీపీ అడ్డగోలుగా వ్యవస్థలను నాశనం చేసిందని, భారీగా అప్పులు చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా స్పందించిన జగన్.. ప్రభుత్వం తీరు, చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో జగన్ సరికొత్త స్లోగన్‌ ఎత్తుకున్నారు. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే.. జగన్‌ ఉండుంటే. మీడియాతో శుక్రవారం మాట్లాడిన జగన్‌ రాష్ట్రంలోని ప్రజలంతా జగన్‌ ఉంటారని అనుకుంటున్నారు. జగన్‌ ఉండుంటే అమ్మఒడి వచ్చేదని, రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు సాయం అందుతుందని అనుకుంటున్నారని. ఈ వ్యాఖ్యలతో ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేస్తోంది. జగన్‌ ఉండి ఉంటే అన్న మాటలను ప్రజలు చర్చించుకుంటున్నారని, ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయలేక అబద్ధాలు చెబుతోందంటూ చేసిన విమర్శలు ఆసక్తికరంగా మారాయి.

Rules for women: మహిళలు జుట్టు విరబోసుకుని ఈ 4 ప్రాంతాలకు వెళ్లకూడదు
రీసెంట్‌గా విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీరే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in