ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం ఉదయం సమావేశం. మంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు, సూపర్ సిక్స్‌తోపాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. పోలవరం, రాజధాని వంటి వాటికి సంబంధించిన సుదీర్ఘమైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయడంపైనా ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వెలగపూడి సచివాలయంలో చాలా రోజుల తర్వాత మంత్రి మండలి సమావేశం నిర్వహించబడుతుంది. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో ఐదు సంతకాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు మంత్రిమండలి సిద్ధమవుతోంది. సంతకాలు ఆయా హామీలు వేగంగా అమలు అయ్యేలా చర్యలకు మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. అలాగే, 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కూడా రూపొందించాల్సి ఉంది. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు, ఇప్పటికే అమలవుతున్న పథకాలు, ప్రభుత్వ ఖర్చులు.. అన్నింటిని భేరీజు వేసుకొని బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంది. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు అనుగుణంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా విషయాల్లో కుంభకోణాలు జరిగిన ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్న వేళ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ.
ఈ సమావేశంలో వీటిపైనా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుకు పలు లేఖలు రాశారు. ఇసుక, మద్యం పాలసీ వంటి సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. ఈ మంత్రి మండల సమావేశంలో వీటిపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలు, రుషికొండపై నిర్మించిన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే దానిపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరాన్ని సందర్శించారు. అమరావతిలో పలు ప్రాంతాల్లో ఆయన ఉన్నారు. వీటికి సంబంధించిన పనులపై ఈ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో నిర్మించిన నిర్మాణాలు మధ్యలోనే ఉన్న వాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ సమావేశానికి అనుగుణంగా నిర్ణయాలను వెలువరించే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు నూతన మద్యం పాలసీ, ఇసుక విధానం వంటి వాటిపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.