రాష్ట్ర హోం మంత్రి అనితను ఉద్దేశించి వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన రెండు రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డిపై మంత్రి అనిత విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి విమర్శలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదంటూ. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయిందని. బయటకు వస్తే ఏముతుందో తెలియని దారుణ స్థితి రాష్ట్రంలో నెలకొంటోంది. ఈ పరిస్థితికి హోం బాధ్యత మంత్రిదేనని స్పష్టం చేశారు. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇది హోం మంత్రి వైఫల్యమని స్పష్టం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి అనిత
హోం మంత్రిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామ స్పందించారు. తనదైన శైలిలో విజయ్ సాయి రెడ్డికి ఆమె కౌంటర్ ఇచ్చారు. “శాంతి”- భద్రత విషయాల్లోరాజీనామా, మీరు నేను ఏమి చేయాలో కాలమే త్వరలో నిర్ణయించబడుతుంది. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదనీ, ఎన్డీయే ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజలు బాగానే ఉన్నారన్న అనిత.. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఇన్ స్పోర్ట్స్ మోడ్.. రష్మిక మందన్నా ఇన్ శారీ మూడ్..
వర్షాకాలంలో దోమల నివారణకు సహజ పద్ధతులు