సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జనసేన, బిజెపి కూటమి 161 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు, మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. గురువారం సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18న తొలి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై సమీక్షించనున్నారు. అలాగే, వివిధ శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదలపై చర్చిస్తున్నారు. అలాగే, ఈ 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దాదాపు నిర్ణయించినట్లు నెల. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే చకచకా కార్యాచరణ ప్రారంభించడం. ఇదిలా ఉంటే సీఎంగా చంద్రబాబు బాద్యతలు స్వీకరించిన తర్వాత సవాలయంలో కలిసిన మీడియా ప్రతినిధులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద మీడియా ప్రతినిధులను చూసి కారు ఆపిన చంద్రబాబు.. ముందుకు వచ్చి మీడియా ప్రతినిధులను పలుకరించారు. సీనియర్ రిపోర్టులను పేర్లతో పలకరించి ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా మాట్లాడారు. ఐదేళ్ల తర్వాత తాము సీఎంను కలిసామని, దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా ఆయన వద్ద తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సవాలయంలో తాము గడిచిన ఐదేళ్లలో సీఎంను కనీసం కలవలేకపోయామని, పరిపాలనాంశాలపై కూడా మాట్లాడలేదని అన్నారు. సచివాలయంలో వార్తలు కవర్ చేసే తాము ఐదేళ్ల తర్వాత సీఎం కలిశామని నవ్వుతూ ఉంది. దీనికి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ఇక నుంచి మీకు ఇక్కడ చాలా పని ఉంటుందని అన్నారు. పాలనలో సమూల మార్పులు ఉంటాయని, ఆనేక చోట్ల మార్పు ఉండబోతుందని చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపి మళ్లీ కలుద్దాం అంటూ ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు.