Home » ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి.. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి.. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపల్లో స్మితా సబర్వాల్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసి.. దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్మితా సబర్వాల్ పై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.