Home » చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా కేజీకి ₹100

చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా కేజీకి ₹100

by v1meida1972@gmail.com
0 comment

సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది కూరగాయల ధరలు ఆకాశ నడుస్తున్నాయి . ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు టమాట చుక్కలు చూపిస్తుంది, కిలో ధర రూపాయలు 100కు పలకడంతో చాలామంది టమోటా కు టాటా చెబుతున్నారు. హైదరాబాదులో రైతు బజార్ లోను నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో టమాట రూపాయలు 51 ఉంటే రూపాయలు 70కి తగ్గకుండా అమ్ముతున్నారని ఇదేంటి అని ప్రశ్నిస్తే పుచ్చులు పుచ్చులున్న మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. ఇంకా ఇంకా బహిరంగ మార్కెట్లో 90 నుంచి 100 వరకు విక్రయాలు సాగిస్తుండడంతో చాలామంది మధ్యతరగతి విలువదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు. ప్రతిరోజు నగరంలో రైతు బజార్లకు 6000 వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతి కందక ప్రస్తుతం 2.5 3 వేల క్వింటాళ్ల వస్తుంది వస్తుంది. డిమాండ్ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉంటే అవకాశం ఉందని చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in