77
పుల్కల్ మండల్ లో పరిధిలోని పెద్ద రెడ్డి పెట్ గ్రామానికి చెందిన పడకంటి మల్లేశం వయసు (48 ) గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద రెడ్డి పేట గ్రామంలో డీలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకేసారి గా గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. అతని భార్య సరిత గత సంవత్సరం క్రితం అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె వయసు (10)ఉంది. మల్లేశం మరణం పట్ల ఆ కుటుంబం వీధిన పడింది. కావున ప్రభుత్వం మల్లేశం కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆయ గ్రామాల డీలర్లు ప్రభుత్వాన్ని కోరారు.