40
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లు ఇప్పిస్తామని చెప్పిందే తప్ప గ్రాంట్ అని చెప్పలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే అప్పు మాత్రమే అనిపిస్తోందన్నారు. ఆ అప్పు ఎవరూ చెల్లిస్తారో అని ప్రశ్నించారు.