వచ్చే ఆరేళ్ళలో రూ.3,658 కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర బాబు
ముద్రణ, తెలంగాణ బ్యూరో : సనోఫి లైఫ్ సైన్సెస్ సంస్థ తన గ్లోబల్ సామర్థ్య విస్తరణపై వచ్చే ఆరేళ్లలో రూ.3,658 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కార్యాచరణ రూపొందించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెళ్లడించారు. వచ్చే ఏడాది కాలంలో రూ.914 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు జరుగుతాయి. దీని వల్ల వచ్చే రెండేళ్లలో 2,600 కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ఆయన రాయదుర్గంలో సనోఫి గ్లోబల్ సామర్థ్య కేంద్రం విస్తరించింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో సాంకేతిక, ఫార్మాకు సంబంధించిన మంచి వసతులు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సఫీనో లైఫ్ సైన్సెస్ సంస్థ హైదరాబాద్‌లోని జీసీసీ స్కెల్ లో ఏఐ ద్వారా ఆధారితమైన మొదటి బయోపార్మ కంపెనీగా అవతరించబోతుందని ఆయన తెలిపారు.
సఫినో సంస్థ విస్తరణ స్థానిక ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సుకు దోహదపడుతుందనే విశ్వాసం అతనిని కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ ను ప్రవేశ పెట్టిన మొదటి ఫార్మా కంపెనీగా సనోఫికి పేరుందని ఆయన చెప్పారు. సనోఫి విస్తరణ రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుందని మంత్రి. బహుళ జాతి కంపెనీల ఏర్పాటుకు, సామర్థ్య వృద్ధికి తమ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.