శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
ధర్మ పరిక్షణకు, త్యాగానికి ప్రతీకగా మోహర్రం నిలుస్తుందని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డిఅన్నారు. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మ్మహమ్మద్ ప్రవక్త మనువడు హజ్రత్ ఇమామ్ హుసేన్ చేసిన ప్రాణ త్యాగం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తోందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన ఇమామ్ జీవితం వర్తమాన సమాజానికి ఆదర్శ ప్రాయమన్నారు.ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను పెంపొందిస్తుందన్నారు.భగవంతుడి దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని, వర్షాలు సంవృద్దిగా కురిసి పంట పొలాలుతో సశ్యశ్యామలంగా ఉండాలని, మత సామరస్యం వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి మోహర్రం శుభాకాంక్షలు తెలిపారు.