105
అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో మృతి చెందింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. దురదృష్టవశాత్తు పరిస్థితి విషమించడంతో పాప మరణించినట్లు తెలిసింది.