66
భద్రాద్రి కొత్తగూడేం జిల్లా అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నఅశ్వరావుపేట SI నుపరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై గారికి ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో బాధాకరమని.. దళిత అధికారిని ఎన్నో రకాలుగా అవమానపరిచి చివరికి ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిళ్లకు గురి చేశారన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరును పూర్తిగా తప్పు పట్టారు. ఈ ఘటనపై CM గారికి పూర్తి స్థాయిలో సమాచారం అందించి ఇందుకు కారకులను కఠినంగా శిక్షించేలా ముందుకు వెళ్తామని తెలిపారు.