ముద్ర/వీపనగండ్ల:- ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల పై విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నచూపు చూడటం సరికాదని అర్హత గల ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని, ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నివేదన ఫ్లెక్సీల ద్వారా ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహించారు.
వీపనగండ్ల జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి, చరణ్ తేజ అనే విద్యార్థి 9.5 జీపీఏ సాధించి వనపర్తి జిల్లాలోనే పాఠశాలకు మూడో స్థానంలో గుర్తింపు లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యాభ్యాసం, పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం, సువిశాలమైన ఆట స్థలాలు, పాఠశాలలోనే గ్రంథాలయాలు, ప్రొజెక్టర్ల ద్వారా విద్యా బోధన, ఉచితంగా పాఠశాల యూనిఫాం విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.