జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం లో 70 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నారు. ఆయన కోరిక తీరడంతో అలిపిరి మెట్లలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు.
పవన్ కళ్యాణ్ గెలవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరో సాయి ధరమ్ తేజ్
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్.. కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు. pic.twitter.com/TLSC2aeZkc
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 15, 2024