ముద్ర ప్రతినిధి,అమరావతి:“రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము” అని శ్రీ పయ్యావుల కేశవ్ అన్నారు.టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసన సభ శాసన సభ కార్యక్రమాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా శ్రీ కేశవ్ మాట్లాడారు.
శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు.రాష్ట్ర ప్రజలకు తనతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు కృషి చేశారు.శాసన సభ కార్యదర్శి శ్రీ పిపికే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి శ్రీ విజయరాజు, ఉప కార్యదర్శి శ్రీ కె. రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏవో శ్రీమతి కె. పద్మజ, స్టేట్ ఎడిట్ అధికారులు, శ్రీ పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియజేశారు.