ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇవాళ తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి రైతులు, రైతులు, రైతులు కూలీలు కాలినడకన వెళ్తున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించేందుకు రాజధాని గ్రామాల రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి చెంతకు కాలినడక వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజధాని 29 గ్రామాల నుంచి రైతులు ఉన్నారు.
2020 జనవరి 10న గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని మొక్కుకునేందుకు ఇదేవిధంగా వెళ్లిన అమరావతి రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేసింది. అప్పట్లో వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. రాయపూడి బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయ్ రావు, భారీగా పోలీసులను మోహరించడంతోపాటు.. ఆయనే స్వయంగా లాఠీలతో రైతులు పై విరుచుకుపడిన పెట్రోల్‌పై రైతులు గుర్తుచేసుకుంటున్నారు. గాయాలు, రక్తం కారుతున్నా నాడు రైతులు వెనక్కి తగ్గలేదు.
అయితే, నాడు మొక్కు తీర్చుకునేందుకు పోలీసులు పూర్తి చేసిన కారోజు అమ్మవారికి మొక్కు చెల్లించేందుకు కాలినడకన అమరావతి బయలుదేరి వెళ్తున్నారు. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన మహిళలను గుర్తు చేసుకుంటూ పాదయాత్రగా అమ్మవారి దేవస్థానానికి అమరావతి రైతులు, రైతులు, రైతులు కూలీలు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న తరువాత తమ మొక్కలను చెల్లించనున్నారు.