Home » బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.. మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం – Sravya News

బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.. మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం – Sravya News

by Sravya Team
0 comment
బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.. మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం



రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోకి నారా లోకేష్ అడుగుపెట్టారు. 4వ బ్లాక్ ఫస్టు ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 లో నారా లోకేష్ బాధ్యతలను ఛాంబర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన మెగా ఫైలుపై తొలి సంతకాన్ని చేసి కేబినెట్‌కు పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు లొకేష్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. స్వీకరణ సందర్భంగా మంత్రులు బాధ్యతలు గుమ్మడి సంధ్యారాణి, ఎస్‌విత, టీజీ భరత్‌, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమేమహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్‌ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు చంద్రన్న బీమా పరిహారం చెల్లింపును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చంద్రన్న బీమా పరిహారం కింద మూడు లక్షలు మాత్రమే చెల్లిస్తుండగా.. ఈ పరిహారం రూ.10 లక్షలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. ఈ పరిహారాన్ని త్వరలోనే పాత్రికేయులకు, న్యాయవాదులకు కూడా ఆయన వర్తింపజేస్తమని. వైసీపీ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని చెల్లించలేదని. కార్మికుల కార్మిక శాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల నష్టపరిహారం అందించారు ఆయన వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in