తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగిన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని తెలిపినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకుందామని. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే చంద్రబాబుకు ఫోన్ చేసి రేవంత్ మాట్లాడారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే రేవంత్ రెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. తెలంగాణ తెలుగుదేశం పార్టీలను కూడా గతంలో రేవంత్ రెడ్డి నిర్వర్తించారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే.. తాజాగా ఫోన్ చేసి అభినందించినట్లు ఇరు పార్టీలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.